శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం దర్శనానికి విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కి స్వాగతం పలికిన. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి .
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.
జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న ఐదవ శక్తిపీఠం శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం దర్శనానికి విచ్చేసిన గవర్నర్ కి తెలంగాణ హరిత హోటల్ నందు స్వాగతం పలకడం జరిగింది. హరిత హోటల్ నందు పోలీసు వారి గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించడం జరిగినది. అనంతరం గవర్నర్ వెంట శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంకు వెళ్లిన వారికి ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు