రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ..ఏవో పాండురంగచారి

Jul 6, 2026 - 20:48
Jul 6, 2026 - 20:50
 0  2
రైతులకు ఉచిత పత్తి విత్తనాలు పంపిణీ..ఏవో పాండురంగచారి

అడ్డగూడూరు 6 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రం రైతు వేదికలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ(కాపాస్ కాంతి)పథకం లో భాగంగా మోత్కూర్  వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్(కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు)లింగాల నర్సి రెడ్డి,అజింపేట గ్రామ సర్పంచ్ కన్నెబోయిన లింగస్వామి,వెల్దేవి గ్రామ సర్పంచ్ రాచకొండ రమేష్ గౌడ్ సబ్సిడీ కింద మండలం లోని రైతులకి 225 ఎకరాలకు డెమో చేయుటకు మరియు ఉత్పాదకతను పెంచుటకు ఉచిత పత్తి విత్తనాల ప్యాకెట్లను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి ఈ కార్యక్రమంలో పాండురంగాచారి,ఏఈఓ లు అక్షర,రవితేజ,అనూష మరియు రైతులు, తదితరులు పాల్గొనడం జరిగింది.