ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం?
19-09-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండలంలో ప్రభుత్వ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.
చిన్నంబావి మండల మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు తగరం లక్ష్మీ కుర్మయ్య
రుణమాఫీ కానీ రైతులు ప్రజాభవన్ ముట్టడి నేపథ్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చిన్నంబావి మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ డేగ శేఖర్ యాదవ్ మరియు అయ్యవారిపల్లి మాజీ సర్పంచ్ రామస్వామి యాదవ్ ను పోలీస్ స్టేషన్ లో అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది.అక్రమ అరెస్టు ను ఉద్దేశించి మండల ఎంపీటీసీల ఫారం అధ్యక్షురాలు తగరం లక్ష్మీ కురుమయ్య మాట్లాడుతూ రైతులందరికీ రుణమాఫీ చేస్తాము అని చెప్పి చేయకపోగా ఇలాంటి అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాలరాయడమే అవుతుందని అన్నారు. "ప్రజాస్వామిక పాలన" అందించే బాధ్యత మాదని అనేకసార్లు ఎన్నికల ప్రచారంలో వాగ్దానాన్ని ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చినాకా వాటి అన్నిటినీ తుంగలో తొక్కి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది అన్నారు. ఇలాంటి అరెస్టులు బిఆర్ఎస్ పార్టీని గాని, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు.