బూత్ లెవెల్ ఏజెంట్లకు సహకరించాలి

Jul 6, 2026 - 22:35
Jul 6, 2026 - 23:00
 0  3
బూత్ లెవెల్ ఏజెంట్లకు సహకరించాలి

 తిరుమలగిరి 07 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండల కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ తహసిల్దార్ జాన్ మొహమ్మద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలకు మరియు  బిఎల్ఎ బూత్ లెవెల్ ఏజెంట్లకు  మీ మీ పార్టీ కార్యకర్తలను మీ పార్టీ సభ్యులను మరియు మీ పార్టీ ఓటర్లను వారి ఓటు పోకుండా వారి ఓటు గల్లంతు కాకుండా సర్ అనే ప్రక్రియలో బిఎల్ఓలకు సహాకారం అందించాలని అన్నారు ఆధార్ నెంబర్లు ఫోన్ నెంబర్లు ఉండాలని వారికి మీరు పూర్తి సహకారం అందించాలని సమయం చాలా తక్కువ ఉన్నందున ఎవ్వరి ఓటు కూడా పోకుండా ఉండటానికి  సహాయ సహకారం అందించాలని  ఓటు బ్యాంకును సామాన్య మానవుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని బూత్ లెవెల్ ఏజెంట్లకు మరి ఒకసారి కోరుకుంటూ సహకారం అందించాలని తెలిపారు. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి