గద్వాల్‌లో ప్రభుత్వ టాయిలెట్‌లో అక్రమ బైక్ మెకానిక్ షాప్ స్థానికుల ఆందోళన, మామూలు ఆరోపణలు
జోగులాంబ గద్వాల 18 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ మార్గ్ వద్ద MRF టైర్స్ ముందు ప్రభుత్వ ధనంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌ను అక్రమంగా బైక్ మెకానిక్ షాప్‌గా మార్చి నడుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన ఈ నిర్మాణాన్ని ప్రైవేట్ లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని, గతంలోనే ఫిర్యాదులు చేసినా స్థానిక నాయకుల ప్రభావంతో కొనసాగుతోందని వారు పేర్కొంటున్నారు.
"ప్రభుత్వం ప్రజా సౌకర్యాల కోసం ఖర్చు చేసిన డబ్బు వృథా అవుతోంది. ఈ టాయిలెట్‌ను బైక్ రిపేర్ షాప్‌గా మార్చడం వల్ల మహిళలు, పిల్లలు సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు". "ప్రతి నెలా మామూలు (బ్రైబ్) స్థానిక అధికారులు లేదా నాయకుల ఖాతాలోకి వెళ్తోందని సందేహాలున్నాయి. ఈ నిజాలు బయటకు రావాలి".
ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణల మధ్య ఈ వివాదం మరింత ఉధృతమవుతోంది. మున్సిపల్ డిపార్ట్‌మెంట్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానిక సమాజం డిమాండ్ చేస్తోంది.