ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో వికలాంగులకు 5శాతం కేటాయించాలి
భువనగిరి 18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిరుద్యోగ యువతకు 37 రకాల యూనిట్స్ స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు చేయాలని నిర్ణయం చేసింది.2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం రిజర్వేషన్స్ వికలాంగులకు అమలు చేయాలి.కానీ ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఎక్కడ కూడా వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని లేదు.ఎస్సీ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన స్వయం ఉపాది యూనిట్స్ కేటాయింపులో వికలాంగుల తీవ్ర అన్యాయం జరుగుతుంది.ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ను వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కలిసి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. కానీ జిల్లా స్థాయిల్లో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్లలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు ప్రస్తావన లేదు.వెంటనే ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ సవరించి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. సురూపంగా ప్రకాష్ అధ్యక్షులు వనం ఉపేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్లపల్లి స్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త లలిత జిల్లా కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.