శిశువు మృతిపై డీఎంహెచ్ఓ విచారణ

Oct 8, 2024 - 19:49
 0  10
శిశువు మృతిపై డీఎంహెచ్ఓ విచారణ
శిశువు మృతిపై డీఎంహెచ్ఓ విచారణ

జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల:- పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు సాధారణ ప్రసవం చేస్తుండగా కడుపులోనే నవజాత శిశువు మరణించడంపై జిల్లా వైద్యాధికారులు విచారణ చేపట్టారు.జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ ఎస్కే. సిద్ధప్ప, డాక్టర్ ప్రసూనారాణి (మాత శిశు సంరక్షణ అధికారి) గద్వాల పట్టణంలోని కేపీఎన్ ఆస్పత్రిని సందర్శించి సోమవారం జరిగిన శిశువు మృతిపై ఎంక్వయిరీ చేశారు.శిశువు మృతి చెందడానికి గల కారణాలను హాస్పిటల్ యాజమాన్యం వారిని అడిగి తెలుసుకున్నారు. విచారణలో భాగంగా కేపీఎన్ ప్రవేట్ ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, ఐపీ రిజిస్టర్, కేస్ షీట్ , డిశ్చార్జ్ సమ్మరీ , ల్యాబ్ రిపోర్ట్స్, ఫార్మసీ బిల్స్ వెరిఫై చేశారు. అనంతరం ఎంక్వైరీ రిపోర్టును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు పంపనున్నట్టు డీఎంహెచ్​ఓ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333