వాగుపై మోకాలిలోతు వరకు గుంతలు.

అధ్వానమైన రోడ్డును పట్టించుకోని అధికారులు

Sep 26, 2024 - 17:24
Sep 26, 2024 - 17:35
 0  3
వాగుపై మోకాలిలోతు వరకు గుంతలు.

మండల కేంద్రంలో రహదారి ఏర్పాటు పూర్తి  చేయాలి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు.

జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-ఇటిక్యాల. మండల కేంద్రంలోని మల్లమ్మ కుంట చెరువుకు ఆనుకొని ఉన్న  రహదారి (వాగు )పై మోకాలి లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు ఆరోపించారు. దీనితో గ్రామస్తులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గురువారం గ్రామస్తులతో కలిసి ఆయన గుంతలు పడిన  రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నెలరోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు వాగుపై గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో  నేటి వరకు అధికారులు  వచ్చి.. ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలకు తెలియజేసీ ఫోటోలు దిగారే తప్ప.. నేటికీ మరమ్మతులు చేయడం లేదన్నారు. ఫోటోలు దిగడానికి ముందుకు వచ్చిన అధికారులు.. మరమ్మతులు చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. బుధవారం రాత్రి  మరోసారి వాగు ఉదృతంగా ప్రవహించిందన్నారు. వాగు పై స్వల్పంగా నీరు ప్రవహించిన.. రహదారిపై ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాగు పై గుంతలు లోతుగా ఏర్పడడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మండలంలోని పలు గ్రామాల నుండి ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు అనునిత్యం ఈ రహదారి పై ప్రయాణించడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.ఆర్ అండ్ బీ  అధికారులు మరమ్మతులు చేయకుండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే అధికారులు రహదారిపై మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత టిఆర్ఎస్ హయంలో మండల కేంద్రానికి జాతీయ రహదారి నుండి రోడ్డు వేయడం జరిగిందన్నారు. కానీ మండల కేంద్రంలో నేటికీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్ట లేదన్నారు. అధికారులు స్పందించి మండల కేంద్రంలో కూడా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆర్ అండ్ బీ  అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జిల్లా కలెక్టర్ ను కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలియచేస్తామన్నారు. రోడ్డును పరిశీలించిన వారిలో  ఫొటో స్టూడియో జేమ్స్,ఎసురాజు,శివన్న,తిరుమల్ ఇతరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333