లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

మునగాల 04 జనవరి 2025
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలకై బహుజన నేత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కళా నాయకుల కవాతు రాష్ట్ర ఇంచార్జ్ బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న అధ్యక్షతన రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేయి గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కళా నాయకుల కవాతు కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పుల నాగార్జున కోరారు శుక్రవారం మునగాల మండలం బరకత్ గూడెంలోని కమ్యూనిటీ హాల్ సెంటర్లో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనుకయ్య అధ్యక్షతన జరిగిన కళాకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయరాదని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమం అనంతరం మాదిగ కళామండలి మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షుడిగా జిల్లా పెళ్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు యాం పంగి వెంకన్న ప్రధాన కార్యదర్శి కిన్నెర జనార్ధన్ సహాయ కార్యదర్శి వేముల రాజేష్ కోశాధికారి కత్తి నాగయ్య ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు ఎం ఎస్ పి మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను ఎంఎస్పి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడిపాటి పెద్ద కనకయ్య గ్రామ సభ్యులు పాల్గొన్నారు