హర్యానా లో బిజెపి హ్యాట్రిక్ గెలవడం చారిత్రాత్మకం
జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అయిజ పట్టణం బీజేపీ కార్యాలయం దగ్గర స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్న బీజేపీ నేతలు ఈ సందర్భంగా
బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...
హర్యానా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడోసారి గెలవడం చారిత్రాత్మకమని దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధిని చూసి వరుసగా మూడో పర్యాయం భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారని, 2014 ముందు హర్యానాలో కేవలం 2% శాతం ఓట్ల నుండి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం అది బిజెపికే సాధ్యమని దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా బిజెపి గెలుపు తద్యమని 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ మెజార్టీతో గెలుస్తుందని బిజెపి అంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దేశభద్రత విషయంలో రాజీలేని పోరాటం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ అని జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడి కొండ భీమ్ సేన్ రావ్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్.పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ భగత్ రెడ్డి. రఘు.రాజశేఖర్
వీరేష్ గౌడ్. తెలుగు నర్సింహా. వీర రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.