జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు 20 బారికెడ్స్ ను అందజేసిన కాసం ఫ్యాషన్ షోరూం యాజమాన్యం.
జోగులాంబ గద్వాల 15 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల్: జిల్లా కేంద్రం లో ప్రజా రవాణ కు ఏలాంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ ను నియంత్రించేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్, IPS తెలిపారు. జిల్లా కేంద్రం లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు . పబ్లిక్ సర్వీస్ లో బాగంగా ట్రాఫిక్ పోలీస్ విభాగానికి కాసం ఫ్యాషన్ షోరూం వారు ముందుకూ వచ్చి 20 ట్రాఫిక్ బారికెడ్స్ ను అందించడం అభినందనీయం అనీ , ట్రాఫిక్ ను నియంత్రించడం లో బాగంగా ట్రాఫిక్ మల్లింపునకు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగానికి బారికెడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు . అలాగే జిల్లా లో నేర నియంత్రణకు, నేర చెదనకు ఎంతగానో ఉపయోగ పడే CC కెమెరాలను మరిన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావలసిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణలో బాగంగా CC కెమెరాలు ఎర్పాటు చేసి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసందానించడం జరిగిందని శాంతిభద్రతలకు సంబందించిన నిఘా, భద్రతను పర్యవేక్షించడం తో పాటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి CC కెమెరాలతో ఆటోమేటిక్ చలాన్లు విధించడం జరుగుతుందని కావున వాహన దారులు ట్రాఫిక్ ఉల్లంఘన చేసి విలువైన డబ్బును వృధా చేసుకోవడమే కాకుండ రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని, అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి ఆటోమేటిక్ జరిమానాలు జనరేట్ అవుతాయి కావున ట్రిపుల్ రైడింగ్ లో పిల్లలను తీసుకపోతున్నామ, బంధువులను తీసుకపోతున్నామ, ఇతరులను తీసుకపోతున్నామ అనే దానికి మినహాయింపు ఉండదనే విషయాన్ని వాహనదారులు గ్రహించాలని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ లో నిర్లక్ష్యం చేయవద్దని తెలియజేశారు. వాహనదారులు నో హెల్మెన్ట్, సెల్ ఫోన్ వాడకం, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మొదలైన వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలను వంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు ప్రమాదాలకు గురై శిక్షలకు గురికావద్దని వాహనదారులకు ఎస్పీ సూచించారు.