శాంతినగర్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆకస్మికంగా తనిఖీ

Jan 2, 2026 - 19:24
 0  26
శాంతినగర్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆకస్మికంగా తనిఖీ
శాంతినగర్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆకస్మికంగా తనిఖీ
శాంతినగర్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆకస్మికంగా తనిఖీ

డైరెక్టర్ మురళి శ్రీనివాస్ కి  షో కాజ్ నోటీసు..

 జోగులాంబ గద్వాల2 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  వడ్డేపల్లి శాంతినగర్ లోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయి హిమాన్ ఆసుపత్రిలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ -2010 యాక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, మాధవ్ కృష్ణ  అనే వ్యక్తి ఈ హాస్పిటల్ ని నడుపుతున్నందువలన, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్ జె. సంధ్యా కిరణ్ మై, మరియు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. ప్రసూనా రాణి ఈ హాస్పిటల్ ని సీజ్ చేయడం జరిగింది... తదనంతరము మౌనిక హాస్పిటల్ లో  ఈసీజీ మరియు ఎక్స -రే, మిషన్లు  రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వాడుతున్నందువల్ల, బయో మెడికల్ వేస్టేజ్  నిర్వహణ సక్రమంగా లేనందువల్ల  డైరెక్టర్ మురళి శ్రీనివాస్ కి  షో కాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.. బాలాజీ హాస్పిటల్లో  ఈసీజీ, ఎక్స -రే మిషన్లు  రిజిస్ట్రేషన్ లేకుండా వాడుతున్నందువల్ల, బయో మెడికల్ వేస్టేజ్ నిర్వహణ సక్రమంగా లేనందువల్ల, హాస్పిటల్ రికార్డ్స్ నిర్వహణ సక్రమంగా లేనందువలన హాస్పిటల్ డైరెక్టర్ కి షో కాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ. డెమో.. కే మధుసూదన్ రెడ్డి,నరసయ్య,  డ్రగ్ ఇన్స్పెక్టర్, వినయ్, ఎస్ ఐ నాగ శేఖర్ రెడ్డి, ఆర్ఐ సర్దార్ మియా పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333