ఖమ్మం పోలీస్ కమిషనర్ గారిని కలిసిన నేలకొండపల్లి ఆర్యవైశ్య సంఘం
తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు:- ఖమ్మం పోలీస్ కమిషనర్ గారిని కలిసిన నేలకొండపల్లి ఆర్యవైశ్య సంఘం నేలకొండపల్లిలో ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన య ర్రా వెంకటరమణ కుమారి దంపతులు దారుణ హత్య కేసు విషయంలో త్వరిత గతిన కేసు సాధించి నిందితులను పట్టుకునే విషయంలో పోలీస్ యంత్రాంగం చేసిన కృషికి కృతజ్ఞతా భావంతో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రే గూరి హనుమంతరావు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర మాజీ అధ్యక్షులు కొత్త రమేష్ , యర్రా నాగేశ్వరరావులు కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్తు గారిని వారి ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి వారికి చిరు సత్కారం చేయటం జరిగినది కేసు విషయంలో రాత్రి పగలు శ్రమించివారు నేరస్తులను పట్టుకున్నందుకు ప్రజలలో ఒక ధైర్యం వచ్చింది పోలీస్ యంత్రాంగం మీద ఒక నమ్మకం ఏర్పడ్డది వారికి తెలియజేయడం జరిగినది కమిషనర్ గారు మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులను దూరంగా ఉండాలని వారికి ఏ విషయాలు తెలియజేయకూడదు ఇండ్లు కిరాయికి ఇచ్చే విషయంలో వారు లోపల నాన్ లోకల్ వారి ఐడెంటి ఉంటేనే వారికి రెంట్ కి ఇవ్వాలని అపరిచితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఏవైనా సంఘటనలు జరిగితే అనుమానాస్పదం అనిపిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని సూచించారు ఆ తదుపరి నేలకొండపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి వారు చేసిన కృషి కూడా మరువలేనిది అని తెలియజేసి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసి అభినందించటం జరిగినది