డ్రగ్స్ నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలి. డి.ఎస్.పి హరిచంద్ర రెడ్డి
హైదరాబాద్ 26 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాద్ మహానగరంలోని మాయదారీ మత్తులో పడి.. యువత జీవితం నాశనం చేసుకోవద్దు.యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.విద్యార్థులు డ్రగ్స్ పై అవగాహన కలిగివుండాలి.విద్యార్థులు ఒకరికొకరు సోదరభావంతో కలిసిమెలసి ఉండాలి.విద్యార్ధులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.యాంటీ నార్కోటిక్ డిఎస్పీ హరీష్ చంద్రారెడ్డి విద్యార్థులు మాయదారి మత్తులో పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ నార్కోటిక్ డీఎస్పీ సి. హరీష్ చంద్రా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వివేకానంద జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో సీఐ భూపాల్ శ్రీధర్ అధ్యర్యంలో వివేకానంద జూనియర్,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సి. జైపాల్ రెడ్డి అధ్యక్షతన యాంటి డ్రగ్స్ పై విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నార్కోటిక్ డీఎస్పీ హరీష్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలన్నారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల గురించి హితవు పలికారు. యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని, సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు. ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని, మత్తులో నిద్రిస్తాడని, క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వచ్చినా, విక్రయిస్తున్నట్టు తెలిసిన పోలీసులకు సమాచారం అందివాలని అప్పుడు మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు పోలీసు వారికి తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలియజేశారు. చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు, అదేవిధంగా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయరాదని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాటించవలసిన రహదారి నియమ నిబంధనలను విద్యార్థులకు వివరణాత్మకంగా వివరించారు.