వ్యాపారవేత్త మిక్కిలినేని వేణు కుమారుడి మరణం పుడ్చలేనిది
ప్రముఖ కవి, గాయకుడు కొంపెల్లి దశరథ.
చెట్టంత కొడుకు కళ్ళ ముందే కడతేరినపుడు ఆ తండ్రి పడే వేదన భరించరానిదని కవి గాయకుడు శ్రీ వశిష్ట విద్యా సంస్థల అసోసియేట్ డీన్ కొంపెల్లి దశరథ అన్నారు. మంగళ వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణనగర్ కాలనీకి చెందిన వ్యాపార వేత్త మిక్కిలినేని వేణు ఏకైక కుమారుడైన సాయి చంద్ర ఇటీవల గుండె పోటు తో కన్ను మూయడం తో విషయము తెలుసుకున్న దశరథ,తన ప్రాణ మిత్రుడైన వేణు ఇంటికి వెళ్లి సాయి చంద్ర చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా తండ్రి వేణు మాట్లాడుతూ, మా బాబు మమ్ముల విడిచి వెల్లినా, జీవితానికి సరిపోయే జ్ఞాపకాలు మిగిల్చి వెల్లాడని అతని ఆశయాలను నెరవేర్చేందుకు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.అందుకు శ్రీ వశిష్ట విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వంశీ చంద్ర సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళతామని తెలిపారు.