- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందించిన మంత్రి సీతక్క
ఆగస్టు 4 గోవిందరావుపేట తెలంగాణ వార్త:- గోవిందరావుపేట మండల కేంద్రములో మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా అధికారులు పని చేయాలని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన కొద్ది కాలం లో ఎన్నికల సమయములో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందని మహిళా లకు ఉచిత బస్ ప్రయాణం తో పాటు 500 కే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు