రెండు లక్షల రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని AIKMS
తెలంగాణవార్త ఆత్మకూరు యస్ 2 లక్షల రైతు రుణ మాపి తక్షణమే మాపి చేసి, పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 25000 చెల్లించాలి ఎండిపోయిన వరి పంటలను పరిశీలన చేస్తున్న నాయకులు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్)మండలంలో ఆత్మకూరు,ఖాసిగుడెం లలో అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీ లలో భాగంగా 2 లక్షల రైతు రుణ మాపి తక్షణమే చేసి,పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 25000 చెల్లించి, యాసంగి నుండి క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలి అని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా AIKMS రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ* కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని నేటికి 100 రోజులు గడుస్తున్న చేయకపోవడం మూలంగా కొత్త రుణాలు తీసుకోవడం కొరకు రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టు వరకు అందించని మూలంగా కొన్ని మండలంలోని అనేక గ్రామాలలో వరి పంటఎండిపోయి రైతుకు మరింత నష్టానికి గురికావాలిసీ వచ్చింది. అనేకసార్లు అధికారులకు చెప్పిన ఫలితం లేకుండా పోయింది. అధికారుల పర్యవేక్షణ లేని మూలంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుకోవడం మూలంగా చివరాయకట్టువరకు నీరు అందడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల పాలవుతున్నారు దీనికి కారణం ప్రభుత్వమే కాబట్టి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25000 చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ యాసంగి నుండి క్వింటాకు 500 బోనస్ ఇవాళ అన్నారు. మద్దతు ధరల చట్టం అమలయంత వరకు పోరాడాలన్నారు. *ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య , ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఎస్ కె మైబెల్లి,పోరెండ్ల దశరథ, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు సామ నర్సి రెడ్డి, డేగల వెంకట కృష్ణ,అరుణోదయ డివిజన్ కార్యదర్శి ఎర్ర ఉమేష్,సంజీవ రెడ్డి,తాల్లపల్లి లింగయ్య, ఉప్పుల పిచ్చయ్య,చిట్టలూరి వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.