మల్దకల్ లో పవమాన హోమం
జోగులాంబ గద్వాల 13 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్ ఆదిశీలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం పవమాన హోమం నిర్వహించారు. గట్టు మండలం చాగదోన గ్రామానికి చెందిన రాధాకిషన్ రావు, గురురాజు రావు ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ పవమాన హోమం ను వేద పండితులు ప్రదీప్ నిర్వహించారు. అంతకుముందు శ్రీ తిమ్మప్ప స్వామికి, శ్రీ శేష దాసులకు ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీరేంద్ర దాస్, శశాంక దాస్, రమేష్, రవి, ముకుందరావు, సురేందర్ రావు కోయిలదిన్నె పురందరు రావు అనిల్ కుమార్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.