వేతనాల పెంపుకై ఆసుపత్రి కార్మికులు పోరాటానికి సిద్ధంకండి

Jun 21, 2024 - 18:08
 0  4
వేతనాల పెంపుకై ఆసుపత్రి కార్మికులు పోరాటానికి సిద్ధంకండి

పేరుకే జీవో 60 అమలు జాడేది.

వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ చెల్లింపుల్లో ఏజెన్సీ భారీ అవినీతి అక్రమాలు.

 -పి.సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి.

గద్వాల జనరల్ ఆసుపత్రి పడకల సామర్థ్యం పెంచి అదనపు కార్మికుల సంఖ్య పెంచాలి.

కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి.:- బి. ఆంజనేయులు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు.

జోగులాంబ గద్వాల 21 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :-    ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులు వేతనాల పెంపుకై మిలిటెన్సీ పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి సురేష్ అన్నారు. శుక్రవారం గద్వాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధ్య భద్రత పేషంట్ కేర్ సూపర్వైజర్ విభాగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
    ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ మాట్లాడుతూ:- ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య భద్రతా పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు, పిఎఫ్ ఈఎస్ఐలు చెల్లించకుండా నిర్వహణ ఏజెన్సీలు కార్మికుల వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ లో భారీ కోతలు పెడుతూ గత రెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతూ జీవోలు విడుదల చేస్తూ కోట్ల రూపాయల బడ్జెట్ లు ఖర్చు చేస్తున్న క్షేత్రస్థాయిలో పారదర్శకతో కూడుకున్న పర్యవేక్షణ లేని కారణంగా ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆదేశాలను జీవోలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్ 60 ప్రకారం ప్రతి కార్మికునికి ప్రభుత్వం 15600 ఖర్చు చేస్తున్నదని ఇందులోనుండి 12093 బేసిక్ వేతనం,కార్మికుల వాటా 12% కాంట్రాక్టర్ ఏజెన్సీ వాటా 13% మొత్తం 25%తో 3023 రూపాయల పిఎఫ్ 484 ఈఎస్ఐ లు ప్రతి కార్మికునికి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్న కేవలం 11000 రూపాయలు వేతనం 1080 రూపాయలు పిఎఫ్ లు మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు.    
ఏఐటీయూసీ గద్వాల జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు మాట్లాడుతూ.....
ఏజెన్సీ కాంట్రాక్టర్లు అంత మాఫియాగా మారి ఒక్కో ఆసుపత్రుల్లో ఒక్కో వేతనం అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో ఆసుపత్రి కార్మికులు తీవ్రమైన శ్రమదోపిడికి గురవుతూ ఆర్థికంగా చితికి పోతున్నారని అన్నారు.
గద్వాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మారిన ఇప్పటికి వైద్య విధాన పరిషత్ పరిధిలోనే ఆస్పత్రి కొనసాగుతూ ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వం జనరల్ ఆసుపత్రిని 240 పడకల ఆసుపత్రిగా గుర్తించి అనుమతి ఇచ్చిన పారిశుద్ధ్య భద్రత పేషంట్ కేర్ నిర్వహణకు మాత్రం 140 పడకలకు మాత్రమే అనుమతి ఇస్తూ గత ప్రభుత్వం టెండర్లు పిలిచారని దీనితో కార్మికుల సంఖ్య ఆసుపత్రి పడకలకు అనుగుణంగా పెరుగకపోవడం చేత కార్మికులపై అదనపు పనిబారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధనకే కార్మికుల సంఘటితం కావాలని అన్నారు. 
   ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి,గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్రాంచ్ కార్మికులు నాగరాజ్,మతీన్,అంజి,లక్ష్మణ్, నరసింహ,ఎల్లప్ప,వెంకటేశ్వరస్వామి, లక్ష్మి సుజాత,చామంతి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333