వెల్దేవి గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా మహిళ సంబరాలు

Mar 14, 2025 - 20:26
Mar 14, 2025 - 23:06
 0  55
వెల్దేవి గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా మహిళ సంబరాలు

అడ్డగూడూరు14 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో మహిళా మాతృ మూర్తులు గ్రామంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు నిర్వహించారు.గ్రామంలో సంప్రదాయం ప్రకారంగా వివిధ రకాల రంగులతో ఆట పాటలతో సంప్రదాయం మర్చిపోకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగ కులబేదా,మత విభేద, లేకుండా వరుస,వాయి,లేకుండా జరిగే ముందు తరాల నుండి వచ్చే వానవాయితీ హోలీ సంప్రదాయమని వారు చెప్పుకొచ్చారు.మహిళా మాతృ మూర్తులు ఆట పటలతో కాముని పున్నమితో వచ్చే ఈ పండుగను భక్తి శ్రద్దలతో శ్రీ పురుషులు,వరుస,వాయి విభేదాలు లేకుండా జరుపుకునే పండుగ హోలీ పండుగ అని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో వెల్దేవి మహిళా మూర్తులు ఘనంగా నిర్వహించారు.ఇంటింట తిరుగుతూ..ఆటపాటలతో వారి అపురూప గానంతో హోలీ పండుగ పాటలు పాడుతూ..కనువింపు చేసేలా వారికి తోచిన సహాయం తీసుకుంటూ.. సంప్రదాయం ప్రకారంగ గ్రామంలో మధ్యాహ్నం సమయం 12 గంటల వరకు గ్రామంలో పెద్దలు, పటేన్లు,పట్వారిలు,మామూలు సామాన్యమైన ప్రజల ఇళ్లల్లో తేడా లేకుండా ఇంటింటా తిరుగుతూ.. సంప్రదాయ సంవత్సరానికి ఒకసారె వచ్చే పండుగను గ్రామ మహిళ మూర్తులు హోలీ పండుగ నిర్వహించుకుంటారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా మృతులు నిర్మాల లక్షమమ్మ,ఇంద్రకంటి లక్ష్మమ్మ,బోడ సోమక్క,ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.