మానాయకుంట ఎక్స్ రోడ్డు నుండి వలిగొండ కోటమర్తి స్టేజి వరకు బిటి రోడ్డు

Mar 14, 2025 - 20:22
Mar 14, 2025 - 23:03
 0  100
మానాయకుంట ఎక్స్ రోడ్డు నుండి వలిగొండ కోటమర్తి స్టేజి వరకు బిటి రోడ్డు

మానాయకుంట ఎక్స్ రోడ్డు నుండి వలిగొండ(ఎన్ హెచ్) కోటమర్తి స్టేజి వరకు బిటి రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అడ్డగూడూరు 14 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట ఎక్స్ రోడ్ నుండి వయ గట్టుసింగారం,ధర్మారం, కోటమర్తి స్టేజి వలిగొండ ఎన్ హెచ్,సి,ఆర్,ఆర్ నిధులు 9 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ప్రారంభించారు.ఈ రోడ్డు వలన గట్టుసింగారం, ధర్మారం,కోటమర్తి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కొన్ని సంవత్సరాల కలను సహకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మూడు గ్రామాల ప్రజలు ఎప్పటికి రుణపడి ఉంటారని అన్నారు.ఎన్నో ఏళ్ల కల సహకారం అయిందని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఉత్తంకుమార్ రెడ్డి,సహాయ సహకారాలతో అడ్డగూడూరు మండలంలోని అనేక గ్రామాలకు రోడ్లను సాంక్షన్ చేసుకున్నట్లుగా తెలిపారు.అదే విధంగా మానయకుంట నుంచి జానకిపురం గ్రామంవరకు రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయని అది కూడా త్వరలోనే పూర్తవుతుందని అన్నారు.ఈ ప్రాంత బిడ్డగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ రుణపడినని ఆయన తెలిపారు.గత పాలకులు కమిషన్ల కోసమే పనిచేశారు కానీ ఈ ప్రాంత పుట్టిన వాడిని కాబట్టి ప్రభుత్వంతో కొట్లాడి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అదేవిధంగా మానాయకుంట వాగులో చెక్ డ్యామ్ త్వరలో కట్టించి తీరుతామని బిక్కేరు వాగులో చెక్ డ్యామ్ లో నిర్మాణంతో పాటుగా ఉత్తంకుమార్ రెడ్డి సహాయక సహకారాలతో నీటిని వదిలినట్లుగా ఆయన తెలిపారు.గత పాలకుల కాలంలో బిక్కేరు వెంబడి ఉన్న గ్రామాలు కరువును చూశాయని అలాంటి సందర్భాలు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు.కొంతమంది అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు.పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఈ నరసింహులు మరియు ఏఈ,డిఈ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మనగోటి జోజి,టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటీకల చిరంజీవి, బాలెంల సైదులు,మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి డైరెక్టర్లు బాలెoల విద్యాసాగర్,చిత్తలూరి సోమయ్య,గ్రామశాఖ అధ్యక్షుడు దేశాబోయిన వీరయ్య,కడారి శ్రీశైలం,తారల శ్రీశైలం,కడారి శ్రీను,కడారి నాగరాజు,పార్టీ మహిళా నాయకురాలు దాసరి వీరలక్ష్మి,వినోద,బొమ్మగాని అంజమ్మ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.