ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చేపట్టాలి

Oct 23, 2025 - 18:25
 0  2
ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చేపట్టాలి

దగడపల్లి రైతు వేదికలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

చిన్నంబావి మండలం24అక్టోబర్ 2025తెలంగాణ వార్త : వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని దగడపల్లి గ్రామంలో రైతు వేదికలో గురువారం వ్యవసాయ శాఖ అధికారి సాయి రెడ్డి ఆధ్వర్యంలో వరి కొనుగోలు శిక్షణ తరగతుల కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు తెచ్చిన వరి ధాన్యం తేమ శాతం వివరాలను రిజిస్టర్లలో తప్పకుండా నమోదు చేయాలని, ఖరీఫ్ 2025-26 సీజన్ లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ పంట సీజన్లో వరి కొనుగోలు ప్రక్రియ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలన్న ఉద్దేశంతో వ్యవసాయ రెవెన్యూ శాఖల యంత్రాంగం ముందస్తు ఏర్పాటు చేస్తుందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురాభి, రెవిన్యూ వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. గురువారం దగడపల్లి రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు పలు సూచనలు చేశారు. రైతులు కేంద్రాలకు వచ్చేటప్పుడు తడవుగా ఉండే పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా టార్పాలిన్ షీట్లు, నీడ కోసం షెడ్లు, త్రాగునీటి సౌకర్యం గన్నీ బ్యాగులు వంటి అన్ని అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండాలి అని సూచించారు. వరి కేంద్రములో కాంటా అయిన వెంటనే మిల్లులకు తరలించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం అని తెలిపారు. అలాగే సన్న మరియు దొడ్డు రకాల వరి ధాన్యాన్ని గుర్తించడంలో సిబ్బందికి సమీష్టమైన అవగాహన అవసరమని చెప్పారు. ధాన్యం కొలత గ్రేడింగ్ మిల్లు తరలింపు తదితర అంశాలలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. రైతుల నుంచి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తేనే ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందిని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు సాయి రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్, పిఎసిఎస్ సీఈవో కొనుగోలు కేంద్రాలు ఇన్చార్జిలు రైతులు సమైక్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333