జూరాల ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరగడంతో గురువారం సాయంత్రం 4 గేట్లు తెరిచినట్లు ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం నుంచి 75000 క్యూసెక్కుల వరదనీరు ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 4 గేట్ల ద్వారా 15,500 క్యూసెక్కుల నీరు బయటికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 7.279 టీఎంసీలుగా ఉంది.