వృద్ధులను గౌరవిద్దాం !! వృద్ధాప్యాన్ని ఆదరిద్దాం

Oct 14, 2025 - 13:30
Oct 14, 2025 - 13:30
 0  0

అంతేకాదు అవమానించకుండా ఉండడం కూడా సమాజం బాధ్యత.* వాళ్ళ అనుభవాలు భవిష్యత్తు తరాలకు చో ధక శక్తిగా పనిచేయాలి. వాళ్ళ పరిణతి జ్ఞాపకాలు సమాజాన్ని నడిపిస్తాయి సుమా.!

****************************************

--- వడ్డేపల్లి మల్లేష్ 90142 06412 

----15....03....2025******---*********---*

పేదలు, వృద్ధులు అవమానించబడకూడదు, పీ డించబడకూడదు అందుకు ప్రతిగా గౌరవించబడాలి, వారిని ఆదర్శంగా సమాజం తీసుకోవాలి, భవిష్యత్తు తరాలకు వారి అనుభవాన్ని వినియోగించుకోవాలి. ఆ విజ్ఞత నడుస్తున్న చరిత్రకు నడుస్తున్న సమాజానికి ఉండాల్సిన అవసరం చాలా ఉన్నది. సమాజంలో వృద్ధుల యొక్క ప్రాధాన్యత బాధ్యత భావితరాలకు వారిచ్చే సందేశాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో ఆగస్టు 31 ని జాతీయ వృద్ధుల దినోత్సవం గా ప్రకటించడం జరిగింది .అలాగే ఐక్యరాజ్యసమితి కూడా వృద్ధులకు తగిన ప్రాధాన్యత నివ్వడం కోసం 1990 డిసెంబర్ 14వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ డిసెంబర్ ఒకటిని అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం గా 45 / 106 తీర్మానం ద్వారా ఆమోదించడం చారిత్రాత్మకం. ఆ రకంగా జాతీయంగానూ అంతర్జాతీయంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ వృద్ధులకు వృద్ధాప్యానికి తగిన ఆదరణ లభించినట్లు అయింది అని భావించవచ్చు. పుట్టిన వాళ్ళు ఎవరైనా కాలక్రమంలో వృద్ధులుగా మారక తప్పదు ఈ దశ ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఈ సత్యాన్ని గుర్తించే వారిని అవమాణించకుండా వేధింపుల గురి చేయకుండా వారి కష్టార్జితాన్ని వారి అనుభవాన్ని గుర్తించడం ద్వారా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇటీ వలి కాలంలో అనేక కుటుంబాలలో వృద్ధులను నిర్లక్ష్యానికి గురి చేయడమే కాకుండా రోడ్ల పైన వదిలివేసి పూర్తిగా కుటుంబ బంధాలను తెగదింపుచేసు కున్నటువంటి అరాచక పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. ఇది చాలా దయనీయ మైనటువంటి పరిస్థితి. వృద్ధులపై హింస, నిర్లక్ష్యం చేయడం చట్టరీత్యా నేరం. వారిని తగిన రీతిలో సo రక్షించకపోతే పట్టించుకోకపోతే వారి ఆస్తి పొందే అర్హత అనుభవించే హక్కు వారసులకు లేదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నివ్వడం కూడా సమాజం ఆలోచించ తగ్గది. అంటే కష్టించకుండా అనుభవించే హక్కు లేదు అనే హెచ్చరికకు దీనికి ఎంతో సామ్యము కలదు.

        వారి అనుభవం భవిష్యత్తు తరాలకు చాలా అవసరం :

*************************

వయసు పైబడిన కారణంగా కొంత జ్ఞాపకశక్తి లోపించడమో లేదా కొన్ని రకాల మానసిక ఆస్థిరతకు దారి తీయడం వల్ల కోపతాపాలు రావడం సహజమే అంత మాత్రాన వారిని విసుక్కోకుండా మానవీయకోణంలో చూసుకోవడం కుటుంబ సభ్యుల సమాజం యొక్క బాధ్యత. వారి మనస్తత్వాన్ని పరిస్థితిని ఆరోగ్య స్థితిగతులను అంచనా వేయడం ద్వారా కూడా మనం వారితోనే వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళు మనకు సమాజంలో కనిపిస్తారు. అయితే వృద్ధాప్యం వల్ల చేతకానితనంతో ఉన్నప్పటికీ వాళ్ల ఆలోచనలను అనుభవాలను సమాజానికి ఇవ్వడానికి ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. శ్రమ యొక్క జీవన సౌందర్యాన్ని ఆరాధించిన వాళ్లు కనుక వాళ్ళ అనుభవాలను ఇప్పటి తరానికి చెప్పడానికి సిద్ధంగా ఉన్న వారి నేర్పును నేటి తరం స్వాగతించాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కేవలం పని విధానమే కాదు మానవ విలువలు, నైతిక విలువలు, శ్రమైక జీవన సౌందర్యం, వృత్తిపట్ల నిబద్ధత, కుటుంబ బంధాలను బలోపేతం చేసే చర్యలను వారి ప్రవర్తన ద్వారా నేటి తరం అనుసరించవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. ఏ పరిస్థితిలోనూ అనుభవాలు, జ్ఞాపకాలు లేదా విజ్ఞానం కూడా నిరంతరం వారసత్వంగా భావితరాలకు వెళ్లాల్సిందే. జ్ఞానం సంపద ఆలోచన ఆచరణ ఒకే స్థాయిలో ఉండడానికి వీలు లేదు. ఆ రకంగా వృద్ధులకు ఉన్నటువంటి అనేక రకాల శక్తి సామర్థ్యముల ను కూడా నేటి తరం అవలోకనం చేసుకొని వాటిని భావితరాలకు అందించడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటది. కొంతమంది వృద్ధులు వైద్య రంగంలో నిపుణులై ఉంటారు. అనేకమైన భయంకరమైనటువంటి వ్యాధులను న్యాయం చేయగలిగినటువంటి శక్తి వారికి ఉంటుంది. ఆ విలువలను రహస్యాలను తెలుసుకోవడం మన బాధ్యత కూడా. మరి కొంతమంది వివిధ రకాల వృత్తులకు సంబంధించినటువంటి నైపుణ్యాలలో ది ట్టగా రాణిస్తారు. వారి అనుభవాలను కూడా సేకరించడం మన బాధ్యత ఆ రకంగా కుటుంబ నేపథ్యం కానీ సమాజం నేపథ్యం కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలను గౌరవించడం ద్వారా వారికి ఆదరణ అందించవలసిన అవసరం చాలా వుంది. వివిధ వృత్తులు, వ్యవసాయం, పశుపోషణ, చేతివృత్తులు, వ్యాపారము వాణిజ్య రంగాలలో కూడా తమదైనా శైలిలో అనుభవాలను జోడించి ఆయా వృత్తులకు వన్నెతెచ్చినటువంటి వాళ్ళు ఎందరో వృద్ధులు మనకు సమాజంలో కనిపిస్తారు. వారి అనుభవాలను నేటితరం సేకరించుకోకపోతే ఆ విలువలు జ్ఞాపకాలు ఇంతటితోనే ఆగిపోతాయి అది ప్రమాదం భవిష్యత్తు తరాలకు నష్టం కూడా.

        మర్యాదగా వ్యవహరించాలి 

**************†**********

కుటుంబంలోనూ సమాజంలోనూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలు దయనీయంగా ఉంటాయి. అవి కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యం లేదా సమాజంలోని ఆధిపత్య భావజాలం కలిగిన వాళ్ల యొక్క అహంకారం ఏదో వృద్ధుల పట్ల ఏహ్య భావం ఇలాంటి కారణాల వలన వారితోని మాట్లాడడానికి కూడా సిద్ధపడని వాళ్ళు అనేకం. వాళ్లను వెలివేసినట్లుగా నీచంగా చూసే వాళ్ళు కూడా మనలో ఎందరో ఉంటారు కానీ ఆ స్థితికి మనం కూడా చేరుకుంటామనే సోయి లేకపోవడం వలన ఈ దుస్థితి దాపురిస్తున్నది.అలాంటి దుస్థితికి గండి కొట్టాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కొన్ని తప్పటడుగులు లేదా ఆలోచన సరళి కారణంగా వారి జ్ఞాపక శక్తి సరిగా లేకపోవడం వల్ల కూడా కొన్ని రకాల మానసిక స్థితులకు గురవుతూ ఉంటారు అలాంటప్పుడు వారిని అర్థం చేసుకోవడం ద్వారా ఊరట కలిగించాల్సినటువంటి అవసరం మన పైన ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం యొక్క ప్రాధాన్యత కూడా వారి యొక్క అనుభవాలు జ్ఞాపకాలను సమాజం సేకరించడం, వారికి ఆత్మగౌరవాన్ని ఇవ్వడానికి తగిన ప్రాధాన్యత కల్పించడం, వారి పట్ల వివక్షత కొనసాగకుండా జాగ్రత్త పడడం లక్ష్యాలుగా ఈ దినోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. శారీరక మానసిక పరిస్థితులను బట్టి క్రమంగా క్షీణించే వయస్సులో వారికి తగినటువంటి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మాత్రమే వారిని నాలుగు కాలాలపాటు బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి ఆరోగ్య పరిస్థితి శారీరక సంసిద్ధతను అర్థం చేసుకోకుండా కఠినంగా వ్యవహరించినట్లయితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా మరింత క్షీణించిపోయే ప్రమాదం లేకపోలేదు. ఆ రకమైన పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా మానవతా హృదయముతో కుటుంబ సభ్యులు సమాజం వృద్ధుల పట్ల వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా వృద్ధులకు సంబంధించిన ప్రస్తావన గల చట్టాలను మరింత కఠినంగా అమలు చేయించడానికి పూనుకోవాలి.అదే పద్ధతిలో క్షేత్రస్థాయిలో ఏ రకంగా అమలవుతున్నది పరిశీలించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. అంతేకాదు మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు యొక్క తీర్పు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పైన పరిష్కరించడానికి కార్యాచరణ ప్రకటించడం ద్వారా ఈ సమస్యకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే జాతీయ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాలకు అర్థం ఉంటుంది. అంతేకానీ ఎలాంటి చర్యలు లేకుండా కేవలం ఆడంబరంగా ప్రకటించిన మాత్రాన వృద్ధులకు వృద్ధాప్యానికి ఒరిగేది ఏమీ లేదు. "గతం పునాది మీద వర్తమానాన్ని భవిష్యత్తును నిర్మించడానికి అనేక అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతమే ఎప్పుడైనా గొప్పది ఆ గతానికి వారసులై నటువంటి మన వృద్ధుల యొక్క అనుభవాలు జ్ఞాపకాలు మేధస్సును పునికి పుచ్చుకోవడం ద్వారా మనం భవిష్యత్ తరాలను తీర్చిదిద్ద వలసిన అవసరం ఉంది. అదే మాదిరిగా అంతే బాధ్యతతో వారిని చివరి వరకు కూడా ఆదరించి అవమానాలకు గురి చేయకుండా పోషించవలసిన బాధ్యత కూడా ఈ సమాజానిది అని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలి."

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ రసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333