విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి :ఎమ్మెల్యే

Dec 25, 2025 - 07:19
 0  108
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి :ఎమ్మెల్యే

తిరుమలగిరి 25 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధమ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు     ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు విద్యార్థులు అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని నైతిక విలువలు పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని  అంబేద్కర్ ఫూలే వంటి మహనీయుల యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేదరికం పారద్రోలే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు   విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు కళాశాల మౌలిక వసతులలో భాగంగా అదనపు తరగతి షెడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కళాశాల అడ్మిషన్ డ్రైవ్ లో కూడా పాల్గొంటానని ఈ సందర్భంగా తెలియజేశారు క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు  తదనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు   ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బాలు నాయక్ కళాశాల ప్రిన్సిపల్ మృత్యుంజయ తుంగతుర్తి సూర్యాపేట నిమ్మికల్ ప్రిన్సిపల్ రాజమోహన్రావు పెరుమాల యాదయ్య హరిప్రసాద్ స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ దామెర శ్రీనివాస్ ఎల్సోజు నరేష్ పాలెపు చంద్రశేఖర్ మూల అశోక్ రెడ్డి సుంకరి జనార్ధన్ కందుకూరి లక్ష్మయ్య అంబేద్కర్ వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి