వాన వస్తే మా బజార్లో నడవలేం...
గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఇదే మా పరిస్థితి
గ్రామ కార్యదర్శి కి ఎన్నోమార్లు విన్నవించిన పెడచెవిన పెట్టిన అధికారి
నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో పాండవ చెలక కాలనీలో మా పరిస్థితి దారుణంగా ఉందని ఆ బజారు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. బలమున్న వైపే సి సి రోడ్లు వేశారు. ఈ రోడ్డు పై కక్ష కట్టినట్టే ఈ రోడ్డుకి ఇంతవరకు మట్టి కూడా పోయలేదని గ్రామంలో అన్ని రోడ్లు మంచిగున్న సిసి రోడ్లు వేశారు. ఇక్కడ వర్షం వస్తే ఇండ్లలోకి నీరు పోతుందని వంద సార్లు చెప్పిన గ్రామ కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోలేదు, వర్షం పడితే మనుషులు బయటికి వెళ్లలేని పరిస్థితి లో మేము ఉన్నామని ఈరోజు భారీ వర్షం కురిస్తే ఇండ్లలోకి నీరు చేరే అవకాశం ఉందని ఆ బజారు వాసులు అవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ఎంపీడీవో జమాల్ రెడ్డి పైపులు వేయాలని ఎన్నోమార్లు కార్యదర్శికి చెప్పిన వేస్తాం అని వదిలేసేనాడు.. ఇప్పుడు ఈ తుపాను వలన ఇండ్లలోకి నీరు చేరి ఇండ్లు నాని కూలిపోయే పరిస్థితి కూడా ఉందని అనేక రకాల విష పాములు ఇండ్లలోకి వస్తున్నాయని బజారువాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా యొక్క బజారుకు సీసీ రోడ్లు వేయాలని అధికారులపై చర్యలు తీసుకోవాలని బజార్లో ఆగిన నీళ్ళని వెంటనే జెసిబి లతో బయటకి తరలించాలని కాలనీవాసులు కోరుతున్నారు