ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ అనేది సర్వ సాధారణం
మునిసిపల్ బిల్ కలెక్టర్ MD ఇస్మాయిల్ గారి పదవి విరమణ సందర్భంగా
వనపర్తి జిల్లా పెబ్బేరు మునిసిపాలిటి లో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ నేడు పదవి విరమణ చేసిన MD ఇస్మాయిల్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీ కర్రే స్వామి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ అనేది సర్వ సాధారణం అని,అందరి లాగే శ్రీ MD ఇస్మాయిల్ గారికి కూడా ఈ రోజు రానే వచ్చింది అని, ఈయన ఇన్ని సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితం అయ్యారని,అందరికీ చేదోడు వాదోడు గా ఉంటూ తన కన్న పెద్దవారిని గౌరవిస్తూ తనకన్నా చిన్న వారిని ప్రోత్సహిస్తూ తన ఉద్యోగ బాధ్యతల పట్ల నిరంతరం అంకితభావంతో పని చేశారని కొనియాడారు.
పెబ్బేరు కమీషనర్ శ్రీ ఆది శేషవులు గారు మాట్లాడుతూ శ్రీ MD ఇస్మాయిల్ గారు దూర ప్రాంతం అయినా కూడా అయిజ నుండి పెబ్బేరు కు క్రమం తప్పకుండా రోజూ వచ్చే వారని,తనకు కేటాయించిన టార్గెట్ ను ప్రతి రోజు పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచే వారని ఇక నుండి వారి సేవలు కొల్పోతున్నందుకు బాధగా ఉన్నా శేషజీవితాన్ని సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
అయిజ మేజర్ గ్రామ పంచాయతీ నుండి మునిసిపాలిటి గా పరిణామం చెందే వరకు తన సేవలను అందించారని అయిజ మునిసిపల్ సిబ్బంది కొనియాడారు...