బండ రామారం అంగన్వాడి కేంద్రాల్లో పోషన్ పక్వాడ కార్యక్రమం

తుంగతుర్తి, ఏప్రిల్ 12 తెలంగాణ వార్త ప్రతినిధి తుంగతుర్తి మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో అంగన్వాడి టీచర్ ఆకారపు పూలమ్మ పోషణ మాసం సందర్భంగా తల్లులకు పిల్లల పోషణం, గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడి కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆకుకూరలు, కూరగాయలు తింటే రక్తహీనతను నివారించవచ్చని తెలియజేస్తూ పోషణ మాసం ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రతి ఒక్క మహిళలు రాగులు, సజ్జలు, కొర్రలు, మొదలగు త్రుణ ధాన్యాలలో ఐరన్ పిండిపదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు. చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు గీత, అంగన్వాడీ ఆయా పద్మ, చిన్నారులు పాల్గొన్నారు