వరికి బదులు ఆరుతడి పంటలు మేలు..ఏవో పాండురంగచారి
addagudurunews
అడ్డగూడూరు 20 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని పి.ఏ.సి.ఎస్ నందు అగ్రికల్చరల్ అధికారి పాండురంగ చారి రైతులకి ఎల్ నినో గురించి తెలియజేయడం జరిగింది.వాతావరణ పరిస్థితులు వర్షా భావ పరిస్థిస్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలనీ తెలపడం జరిగింది.ఈప్పుడు ఉన్న వర్షాల దృష్ట్యా వరి సాగుకు బదులు ఆరుతడి పంటలైన కందులు,పెసర , పొద్దుతిరుగుడు,నువ్వులు, జొన్నలు,ఆముదం వంటి పంటలు సాగు చేస్తే బెట్ట పరిస్థితులని తట్టుకుని మంచి దిగుబడులు వస్తాయి.అదే విదంగా కూరగాలా సాగు వైపు మొగ్గు చూపాలని తెలపడం జరిగింది. వరి పంటకి బదులు ఆయిల్ పామ్ వంటి పంటకి రైతులు మార్పు చూపాలని ఒక ఎకరా వరి పంట కు అయ్యే నీటితో రెండు నుండి మూడు ఎకరాల ఆరుతడి పంటలు, మరియు ఆయిల్ పామ్ పంటలు సాగు చేయవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్ధానిక వ్యవసాయ అధికారి పాండురంగ చారి, పి.ఏ.సి.ఎస్ సి ఈ ఓ వేంకటేశ్వర్లు మరియు రైతులు పాల్గొన్నారు.