బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులు

కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

Apr 5, 2026 - 14:55
Apr 5, 2026 - 15:01
 0  6
బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులు
బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులు

సూర్యాపేట,06 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ఆదివారం బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రావు గారు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సమాన హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. బాబు జగ్జీవన్ రావు గారి జీవితం మనకు క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని స్పష్టంగా తెలియజేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజలకు సేవ చేయడం పోలీసు శాఖ ముఖ్య కర్తవ్యమని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీ నరసింహ చారి, అర్ఎస్ఐ లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333