చదువుతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండాలి..

Jul 19, 2026 - 00:56
 0  1
చదువుతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండాలి..
చదువుతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండాలి..

జోగులాంబ గద్వాల 18 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.

విద్యార్థులకు మంచి విద్యతో పాటు, వారు ఆరోగ్యంగా ఉండేలా వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు సూచించారు.

శనివారం అయన అలంపూర్ మండల కేంద్రంలోని కెజిబివి విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న విద్యా, వసతి, భోజన సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, భోజనశాల, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఈ సందర్బంగా విద్యార్థులకు యూనిఫామ్ లను అందజేశారు. వారితో కలిసి భోజనం చేశారు.

      ఈ తనిఖీలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333