ఎన్.పి.ఆర్.డి  ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

addagudurunews

Jul 20, 2026 - 23:59
Jul 21, 2026 - 00:04
 0  34
ఎన్.పి.ఆర్.డి  ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

భువనగిరి 20 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల హక్కుల జాతి వేదిక ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా అనంతరం ఏవో ఎన్ అంజిరెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సురూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ గార్లు మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలనే ఆలోచన విరమించుకువాలని 2016 ఆర్ పి డి చట్టం సలహా మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం 2013 జాతీయ ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలని చేసిన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవలసిన అవసరం.గ్రామీణ ప్రాంతంలోని వికలాంగులతో పాటు పేదలకు ఆహార భద్రత చట్టం ఉపయోగపడుతుంది.ఆహార భద్రత చట్టం వలన నిరుపేదలకు అంత్యోదయ రేషన్ కార్డు వలన కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా 35కిలోల బియ్యం అందుతున్నవి.దీని వలన వికలాంగులతో పాటు పేద ప్రజల కుటుంబాలు ఆహారం హక్కుగా ఉంది. కానీ ప్రతి మనిషికి 7కేజీల బియ్యం మాత్రమే ఇవ్వాలని సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది.

ఈ నిర్ణయం వికలాంగుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా వికలాంగులకు,పేదలకు అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వాలని కోరుతున్నాము. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంవికలాంగులకు సమానత్వం, గౌరవ ప్రధమైన జీవనం, వివక్షత లేకుండా చూడడం, విద్యా, ఉపాది, ఆరోగ్యం, సామాజిక భద్రతతో పాటు అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలని పేర్కొన్నది. వీటిని పర్యవేక్షణ చేయడానికి 2016 ఆర్పిడి చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం రాష్ట్ర వికలాంగుల సలహా మండలి ఏర్పాటు చేయాలి. 2019లో ఏర్పాటు అయినా సలహా మండలి కాలపరిమితి ముగిసి 4 ఏండ్లు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాష్ట్ర వికలాంగుల సలహా మండలి ఏర్పాటు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన వికలాంగుల చట్టం అమలుపై పర్యవేక్షణ లోపిస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సలహా మండలి ఏర్పాటు చేసే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా కోశాధికారి కొత్త లలిత ఎన్ పి ఆర్ డి జిల్లా కం సభ్యులు గడ్డం యాదగిరి జిల్లా కమిటీ సభ్యులు కొలీలిపాక  నాగయ్య వస్తుప్పల మంజుల ఏశాల గోపి వల్లాల రాధాకృష్ణ నూకల వెంకటేష్ స్వామి వడ్డే సుజాత తదితరు పాల్గొన్నారు.