వరస బైక్ దొంగతనాలతో ఎమ్మెల్యే ఎత్తుతున్న మండల ప్రజలు
మునగాల 10 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల మండలంలో బైకుల వరుస దొంగతనాలతో మండల ప్రజలు బంబేలుచుతున్నారు. గత వారం రోజులుగా మండలంలోని బరకత్ గూడెం గ్రామంలో సంఘం కాంతారావు కు చెందిన టీవీఎస్ మోపెడు గ్రామ సెంటర్లో ని తాళం వేసి పక్కన పార్కింగ్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపరించ పోయారు. మంగళవారం రాత్రి ఆదే అదును చూసుకొని గరిడేపల్లి లక్ష్మణరావు ఇంటి ముందు నిలిచి ఉన్న గ్లామర్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తి అపారించాడు. ఈ విషయం సిసి కెమెరా లో పరిశీలించగా అతను బైక్ దొంగిలించిన విధానాన్ని చూశారు. అదే రాత్రి ముకుందాపురం గ్రామానికి చెందిన కొంచెం రాజు తన ఇంటి వద్ద నిలిచి ఉన్న ఎన్ఎస్ 200 బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు అపారించినట్లు తెలిపారు. ఈ విషయమై మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలిపారు. మునగాల ఎస్సై గత పది రోజుల నుండి అందుబాటులో లేకపోవడంతో శాంతి భద్రతలకు కొంత విఘాతం కలిగినట్లుగా కనిపిస్తుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మునగాలకు ఎస్సై ను కేటాయించాలని దొంగతనాలు జరగకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.