అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి-సీఐటీయూ
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి-సీఐటీయూ మండల నాయకులు బుర్రు అనిల్ కుమార్.
అడ్డగూడూరు 10 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- బుధవారం రోజు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అడ్డగూడూరు మండల కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ కి మెమొరండం అందించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు బుర్ర అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చి అంగన్వాడీలను అణిచివేతకు గురి చేస్తున్నారు తప్ప అంగన్వాడిల సమస్యలను పరిష్కరించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఏదైతే మల్టీపర్పస్ విధానం తీసుకువచ్చి అంగన్వాడీలను అన్ని రంగాలలో ఉపయోగించుకుంటూ కనీసం సమాన పనికి సమాన వేతనం కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.అదేవిధంగా నూతనంగా నాలుగు లేబర్ కోర్డులను తీసుకొచ్చి పని భారం పెంచి మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నాలుగు లేబర్ కోర్డులను రద్దుచేసి అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ద్వారా అంగన్వాడీలకు 26వేల రూపాయలు కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి అన్ని అంగన్వాడీల కు న్యాయం చేయాలని సిఐటియుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు రాయిలా రాజ్ కుమార్, అంగన్వాడీల మండల అధ్యక్షురాలు సోమా నాగేశ్వరి, మండల ఉపాధ్యక్షురాలు నిరీక్షణ,లక్ష్మీ,మల్లమ్మ,ఉమా దేవీ, సతమ్మ,లక్ష్మీమమ్మ,సంధ్య,స్వరూప,బాగ్యమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.