మునగాల మండల ఆర్ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మండవ శ్రీనివాస్ గౌడ్...

Mar 24, 2024 - 20:38
 0  9
మునగాల మండల ఆర్ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్  గా మండవ శ్రీనివాస్ గౌడ్...

మునగాల 24 మార్చి 2024

 తెలంగాణ వార్త ప్రతినిధి :-

  మునగాల మండలం లో జరిగిన ఆర్.ఎం.పి అండ్ పిఎంపి సదస్సు కు ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యాపేట జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి అధ్యక్షులు పొనుగోటి భుజంగరావు  మాట్లాడుతూ అందరూ ఐక్యంగా కలిసిమెలిసి పనిచేయాలని కార్యక్రమంలో మునగాల మండల అధ్యక్షులు ఎరుకల శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో మునగాల మండల ఆర్.ఎం.పి వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ గౌడ్ నియమించినారు ఈ కార్యక్రమంలో ఖమ్మంలోనిఎపెక్స్ హాస్పిటల్ మరియు శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీజనల్ వ్యాధుల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతగాని రవిబాబు నేరేడుచర్ల మండల అధ్యక్షులు ఉపేంద్ర ప్రసాద్  కోదాడ మండల అధ్యక్షులు శ్రీను , మరియు మండల ఆర్ఎంపి ,ఎస్ కే జానీ,  ఆదినారాయణ , అనిల్ గౌడ్ , ఖాదర్,  చారి,  శివ గౌడ్,  నాగరాజు గౌడ్ , కాజా మొయినుద్దీన్,  తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State