లెప్రసీ సర్వే డబ్బులు ఆశలకు ఎప్పుడు అందుతాయో? విధుల్లో ఉన్న ఆశల ఆందోళన

Sep 3, 2024 - 17:39
Sep 3, 2024 - 17:39
 0  6
లెప్రసీ సర్వే డబ్బులు ఆశలకు ఎప్పుడు అందుతాయో? విధుల్లో ఉన్న ఆశల ఆందోళన
లెప్రసీ సర్వే డబ్బులు ఆశలకు ఎప్పుడు అందుతాయో? విధుల్లో ఉన్న ఆశల ఆందోళన

హైదరాబాద్ 03 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆశలకు చెల్లించవలసిన జీతభత్యాలు 2023 ఆగస్టు 16 నుండి 31వరకు 14 రోజుల లెప్రసీ సర్వే డబ్బులు ఒక ఆశా కు రూ.1,050/- ల చొప్పున సర్వేకు నెలరోజుల ముందు తేదీ:17.7.2023 న 3 కోట్ల 75 లక్షల 47 వేల 050 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్ గా గత సంవత్సరం సర్వేకు ఒక నెలరోజుల ముందే ఈ అమౌంటును జిల్లాల డీఎంహెచ్వోలకు పంపింది.గత సంవత్సరం నెల రోజుల ముందు అడ్వాన్స్ గా పంపిన అంశాన్ని డి ఎం హెచ్ ఓలు సంవత్సరానికి పైగా దాచిపెట్టి ఇప్పటికి కూడా డబ్బులు రాలేదని రాష్ట్రంలోని సగం జిల్లాల డి ఎం హెచ్ ఓలు అబద్ధాలు చెబుతున్నారు.ఈ సర్వే డబ్బులు వచ్చి ఒక సంవత్సరం దాటింది.జిల్లాల వారీగా ఎంత బడ్జెట్ రిలీజ్ అయిందో వివరాలు మీకు సర్కులర్ పెడుతున్నాము.అన్ని జిల్లాలు 2023 లెప్రసీ డబ్బులు వెంటనే ఆశాల అకౌంట్లో పడే విధంగా పై అధికారులు చొరవ తీసుకొనిడిఎంహెచ్వోల పైన ఒత్తిడి తీసుకురావలని పి.జయలక్ష్మి రాష్ట్ర అధ్యక్షురాలు,ఆర్ నీలాదేవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,పి గంగమణి రాష్ట్ర కోశాధికారి,కాసు మాధవి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో టీ యాదమ్మ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఎస్ శారద రాష్ట్ర నాయకులు మాకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333