కడెం ప్రాజెక్టు18 గేట్లు ఎత్తివేత

Sep 3, 2024 - 17:44
 0  3
కడెం ప్రాజెక్టు18 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్:సెప్టెంబర్ 03:- ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తింది. దీంతో అధికారులు18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 

కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 7.603 టీఎంసీలు. కాగా, ప్రస్తుత నీటి మట్టం 694. 300 అడుగులు,6.198 టీఎంసీలుగా ఉంది. 

ఇన్ ఫ్లో : 194039 క్యూసెక్కులు. ఉండగా, అవుట్ ప్లో: 249054 క్యూసెక్కులుగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరి కలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. కలెక్టరేట్లలో కంట్రోలు రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించిది. ఇరిగేషన్‌, హెల్త్‌ సిబ్బందికి సెలవులు రద్దుచేసింది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333