వరదల ధాటికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న
తెలంగాణ వార్త సెప్టెంబర్ 03 దంతాలపల్లి:- రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ స్థానిక తహశీల్దార్ శ్రీలత కి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆద్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వలన అనేక గ్రామాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి,గ్రామాలు నీట మునిగాయి ఇండ్లు ధ్వంసం అయినాయి ప్రాణ,ఆస్తి, పంటల నష్టం జరిగింది.ఇసుక మేటలతో సాగుకు పనికిరాకుండా పోయింది.పశువులు,మేకలు, గొర్రెలు,కోళ్ళు అదేవిధంగా విద్యుత్ స్తంభాలు విరిగి తీగలు తెగి విద్యుత్ సౌకర్యం లేకుండా ఉంది.కొన్ని ప్రాంతాలలో తినడానికి తిండిలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.వెంటనే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారిని అన్నివిధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు,మరణించిన కుటుంబాలకు 25లక్షల ఎక్స్గ్రెషియా ఇవ్వాలి,పశువులకు నష్టపరిహారం ఇవ్వాలని,ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టించాలి,నష్టపోయిన పంటలకు 25వేల నష్టపరిహారం అందించాలి,తెగిపోయిన కుంటలు చెరువులను వెంటనే పునరుద్ధరించాలని,ఇసుక మేటలు కట్టిన పంట పొలాలను చదును చేసుకోవడానికి ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిర్రా యాకన్న, పొడిశెట్టి లింగన్న, బాణోత్ నరేష్,సంకేపల్లి యాకూబ్ రెడ్డి,గుర్రం యకన్న, భూక్యా రవి,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.