రోడ్లు భద్రత నియమాలు పట్ల అవగాహన""కోదాడ ట్రాఫిక్ పోలీస్

Apr 15, 2026 - 21:50
Apr 16, 2026 - 11:55
 0  1
రోడ్లు భద్రత నియమాలు పట్ల అవగాహన""కోదాడ ట్రాఫిక్ పోలీస్

కోదాడ ట్రాఫిక్ పోలీస్ 15/4/2026.అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం లో భాగంగా చిల్డ్రన్స్ రోడ్డు సేఫ్టీ డే కార్యక్రమం. 

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ: రోడ్డు భద్రతా నియమాలు పట్ల అవగాహన కలిగేలా విద్యార్థులచే మానవహారం నిర్వహించిన కోదాడ ట్రాఫిక్ పోలీస్.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాలు మూడవ రోజున చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే భాగంగా కోదాడ ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో పట్టణంలో హుజూర్ణగర్ చౌరస్తా వద్ద తేజా టాలెంట్ స్కూల్ విద్యార్థులతో కలిసి మానవహరం నిర్వహించి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అంజిరెడ్డి విద్యార్థులతో మానవహారం నిర్వహించి రోడ్డు నియమాల పట్ల అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రోడ్డు నియమాల పట్ల రహదారి వినియోగం పట్ల పాటించాల్సిన జాగ్రత్తల పట్ల తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన అంశాల పట్ల వివరించడం జరిగింది. మానవ తప్పిదాల వల్ల అధిక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ డిఫెన్స్ డ్రైవింగ్ చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ఎస్ఐ తెలిపారు. నేటి బాలలు రేపటి పౌరులు, రోడ్డు ప్రమాదాలు సంభవించి ఏ ఒక్క యువత అర్థంతరంగా మరణించకూడదు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు తీసుకు వెళ్ళేటప్పుడు తీసుకు వచ్చేటప్పుడు తప్పకుండా ద్విచక్ర వాహనంపై ఉన్నవారు హెల్మెట్స్ ధరించాలి. కార్లు ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. హెల్మెట్ వినియోగము సీట్ బెల్ట్ వినియోగం గురించి పిల్లలు తల్లిదండ్రులకు వివరించాలి అని తెలిపారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, యువత త్రిబుల్ రైడింగ్ బైక్ రేసింగ్ లాంటిది నిర్వహించకూడదని తెలిపారు. రహదారి వినియోగంలో విద్యార్థులు యువత తప్పక నియమాలు పాటించాలని జిబ్రా క్రాసింగ్లు వైట్ లైన్స్ ఉన్న చోట రోడ్లు దాటాలని కోరారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State