వెల్దేవి గ్రామ చర్చిలో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు
అడ్డగూడూరు 25 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామ చర్చిలో పిల్లి సుందర్ ఫ్యామిలీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాఇ బలై ప్రేమ అనురాగాలతో ముచ్చటించుకున్నారు. కరుణామయుడు దైవ కుమారుడు సిల్వ యాగం చేసిన మహనీయుడు దైవ స్వరూపుడు ఆయనే యేసుక్రీస్తు అని ఆటపాటలతో ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి బైబిల్ వాక్యాలను వినిపించారు. అనంతరం చర్చిలో భారీ కేక్ కట్ చేసి అందరికి పంచడం జరిగింది. ఏసుక్రీస్తు జన్మదినం వేడుక సందర్భంగా కొంతమంది వృద్ధులకు నూతన వస్త్రములు అందజేశారు. చిలుకూరి పిచ్చమ్మ, బెస్త రాజమ్మ, లక్ష్మమ్మ, ఖమ్మంపాటి లక్ష్మమ్మ, కోటమర్తి నర్సమ్మ, మరి కొంతమందికి చర్చి వ్యవస్థాపకులు పిల్లి శ్రీకళ సుందర్ మరి కుటుంబ సభ్యులు వారికి చీరలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మతస్తులు తదితరులు పాల్గొన్నారు