తలసి మియా వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం

May 8, 2026 - 20:47
 0  1
తలసి మియా వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం
తలసి మియా వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 8 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల.  తేదీ:08.5.2026 న "" అంతర్జాతీయ తలసీమియా దినం"" ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాష షేక్, మరియు B. నర్సింగ్ రావు అడిషనల్ కలెక్టర్  అధ్యక్షతన, వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, మరియు వివిధ లైన్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఆఫీసర్స్, స్టాఫ్ తో, IDOC నుండి కృష్ణవేణి చౌక్ వరకు, ప్రజలకు తలసీమియా వ్యాధి గురించి అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది... 
 * ర్యాలీ  తదనంతరం డాక్టర్.జి.రాజు ప్రోగ్రామ్ ఆఫీసర్,మాట్లాడుతూ  గర్భిణీ స్త్రీలలో తలసీమియా వంశపారపరంగా వచ్చే వ్యాధి ఈ వ్యాధి వల్ల రక్తహీనత ( రక్తంలో హిమోగ్లోబిన్ తయారు అవదు ) వస్తుంది..
* ఈ వ్యాధి వల్ల బాలింతలో, రక్తహీనత అలసట, బలహీనత శిశువు తక్కువ బరువుతో పుట్టడం లేదా ముందస్తు ప్రసవము  జరగడం జరుగుతుంది..
* * తల్లి మరియు తండ్రి క్యారియర్ అయితే 25% పుట్టబోయే బిడ్డకు తలసీమియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది..
** ఈ తల సేమియా వ్యాధి రాకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రతి గర్భిణీ స్త్రీకి  CBP, HPLC, CVC /అమ్నిసెంటేసిస్  పరీక్షలు నిర్వహించాలి మరియు రెగ్యులర్గా డాక్టర్ చెక్ అప్ చేస్తూ ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వాలి..
ఈ తలసీమియా వ్యాధి రాకుండా ఉండాలంటే, పెళ్లయిన దంపతులకు ముందస్తుగా రక్త పరీక్షలు చేయడం మరియు జెనెటిక్ కౌన్సిలింగ్ నిర్వహించడం చేయాలి..
 ఆశా కార్యకర్తలు మరియు ఆరోగ్య కార్యకర్తలు ప్రతి గర్భిణీ స్త్రీకి జిల్లా ఆసుపత్రి గద్వాలలో HPLC, CBP రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని కోరారు అదేవిధంగా తలసీమియా ఉన్న గర్భిణీ స్త్రీలను లేదా బాలింతలను చెక్ అప్స్ కొరకు NIMS హైదరాబాద్ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ కి రిఫర్ చేయాలని తెలిపారు
** ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు ఉద్యోగస్తులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది, ప్రోగ్రామ్ ఆఫీసర్  డాక్టర్ జి. ప్రసూనా రాణి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శరణ్య, కే మధుసూదన్ రెడ్డి, బి.శివన్న, నరసయ్య, మరియు హెల్త్ సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు,ఆశలు, పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333