దళిత గ్రహీత అవార్డు అందుకున్న నిర్మాల  సతీష్

Apr 15, 2026 - 21:08
Apr 15, 2026 - 21:08
 0  6
దళిత గ్రహీత అవార్డు అందుకున్న నిర్మాల  సతీష్

అడ్డగూడూరు 15 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం రోజు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నిర్మల సతీష్ మహాజన్ కి మహనీయుల జయంతి ఉత్సవాల రాష్ట్ర కమిటీ చేతుల మీదుగా దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది.తాను దళితులకు చేసిన సేవకు,కృషి పట్టుదల కు విద్యార్థుల సమస్యల కోసం చేసిన పోరాటాలకు,దళిత జాతి అభివృద్ధికై నిరంతరం పోరాడుతున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం జరిగింది. అతి చిన్న వయసులో "దళితరత్న అవార్డు"గ్రహీతగా  రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం చాలా గొప్ప విజయం అని,ఇంకా దళిత జాతి కోసం అణగారిన వర్గాల విద్యార్థుల కోసం బలమైన పోరాటాలను చేయాలని.ఉత్సవాల చైర్మన్  మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కో చైర్మన్ సుదర్శన్ బాబు టి ఎస్ ఎస్ ఏ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ళ మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. నాకు ఈ అవార్డు రావడం నాకు చాలా గర్వంగా ఉంది. నా దళిత సమాజానికి ముఖ్యంగా టి ఎస్ ఎస్ ఏ రాష్ట్ర కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్  మరియు కో చైర్మన్ సుదర్శన్ బాబు దళిత వర్గాల పెద్దలు ఇటుక రాజు, మహా మేధావులు ఉద్యమకారులు పాల్గొనడం జరిగింది. మహనీయుల సేవలు మరవల్లేమని ఈ అవార్డు అందుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.