రోడ్ల వెంట విచ్చల విడిగా చెట్ల ను నరికి వేస్తున్నారు

Apr 24, 2025 - 20:57
 0  1
రోడ్ల వెంట విచ్చల విడిగా చెట్ల ను నరికి వేస్తున్నారు

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ రోడ్ల వెంట విచ్చల విడిగా చెట్ల ను నరికి వేస్తున్నారు* జడలేని అధికారులు. బారి వేప చెట్ల నరికివేత.. *ఆత్మకూరు ఎస్.* పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ రోజూ పత్రికల్లో సమాచార మాధ్యమాల్లో ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరణ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గానీ లేరనే చెప్పాలి. 15,ఇరవై ఏళ్లుగా పెంచిన బారి చెట్లను కాపాడాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లు వదిలేస్తున్నారు. బొగ్గు బట్టి, కలప వ్యాపారస్తులు ఇతరత్రా చెట్లు నరికడమే కాకుండా ఏకంగా రోడ్లకు ఇరువైపుల ప్రభుత్వం నాటిన చెట్ల ను నరికి వేస్తున్నారు. వేప తుమ్మ చెట్లే కాకుండా అన్ని రకాల చెట్లు నరికి పెద్ద మొద్దులను బొగ్గు బట్టీలకు ఉపయోగిస్తున్నారు. ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో గురువారం pacs ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదురుగా సౌనమ్మ ఆలయం దగ్గర ఉన్న బారి వేప చెట్లు, మరి కొన్ని చెట్ల ను నరికొంతున్నారు. ఇదేమిటి రోడ్డు వెంట ఉన్న చెట్లు కొడుతున్నారు అని అడిగితే పక్కన ఉన్న ఇంటి వాళ్ళు మాకు అమ్మారనీ కలప వ్యాపారి తెలిపారు. ఇప్పటికే ఎండల వేడిమి తో టారెత్తిస్తున్న వాతావరణం రోడ్ల వెంట ఉన్న ఏళ్ల తరబడి పెంచిన చెట్లను ఇస్తాను సారంగా కొట్టి వేస్తుంటే అధికారులు మాకేమి తెలియదంటూ వదిలేయడం తో మరో కొద్ది రోజుల లో పెద్ద చెట్లు కనుమరుగయ్యే అవకాశం ఉంది. మన బావి తరాలకు వాయు కాలుష్యాలను మాత్రమే వారసత్వం గా ఇవ్వాల్సి వస్తుందేమో.