రైతులకు లో దుక్కులపై అవగాహన కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 21 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల. చాగాపురం గ్రామంలోని రైతుల వేదిక నందు వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ ఆధ్వర్యంలో రైతులకు లోతుదుక్కుల పైన అవగాహన కల్పించడం జరిగింది. వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ మాట్లాడుతూ ..... మృగశిర కార్తిలో కురవవలసిన వానలు ఈ ఏడాది కృత్తికా కార్తిలోనే మొదలవడంతో రైతులు లోతు దుక్కులు చేయడం ద్వారా భూమిలో నిద్రావస్థలోని, కోషస్థ దశలో ఉన్న చీడపీడలు, కలుపు మొక్కల విత్తనాలు ఎండవేడికి చనిపోతాయని తెలియజేయడం జరిగింది. తద్వారా పంటల సమయంలో కలుపు ఉద్ధృతి తగ్గుతుంది లోతుగా దున్నడం వల్ల నేలలు నీరు నిలిచే శక్తి పెరుగుతుంది నేలకోత్గురి కాకుండా చూడవచ్చు నేల క్షారత్వాన్ని కూడా తగ్గించవచ్చు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.