పాలిటెక్నిక్ కళాశాలకు బస్సులు లేక విద్యార్థుల ఆవేధన.
జోగులాంబ గద్వాల 6 జులై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం గోనుపాడు వద్ద గల పాలిటెక్నిక్ కళాశాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు కళాశాలకు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గద్వాల అర్టీసి బస్టాండ్ నుంచి అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గద్వాల ఆర్టీసి బస్టాండ్ నుంచి పాలిటెక్నిక్ కళాశాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాయంత్రం వేళల్లో కళాశాల వద్ద బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది అని ఆవేధన వ్యక్తం చేశారు. గద్వాల నుంచి అదనపు బస్సు ఏర్పాటు చేయాలని కోరారు.