రైతుల కోసమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అడిషనల్ కలెక్టర్  శ్రీలత

Oct 19, 2024 - 18:01
 0  1
రైతుల కోసమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు  అడిషనల్ కలెక్టర్  శ్రీలత
రైతుల కోసమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు  అడిషనల్ కలెక్టర్  శ్రీలత
రైతుల కోసమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు  అడిషనల్ కలెక్టర్  శ్రీలత

రైతుల కోసమే ప్రభుత్వం ఐకెపి సెంటర్ లు ఏర్పాటు చేసింది అని అడిషనల్ కలెక్టర్ శ్రీలత అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం పలు ఐకెపి సెంటర్లను ప్రారంభించి వారు మాట్లాడారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు. రైతులకు 500 రూపాయల బోనస్ ను ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఏలాంటి అవకతవక లేకుండా రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు.తేమ ఉన్న  ధాన్యాన్ని తమ పొలం వద్దనే ఆరబెట్టుకొని ఐకెపి సెంటర్ల వద్దకు తీసుకొని రావాలని దానివలన మిగతా రైతులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, టిఎంసి శ్వేత,కుసుమారి గూడెం కౌన్సిలర్ నెల్లుట్ల సోమలక్ష్మి, నాయకులు లింగారెడ్డి, జూలకంటి నాగేందర్ రెడ్డి, గోగుల రామకృష్ణ, ఇరుగు దిండ్ల సైదులు, కుర్రి నాగయ్య, కల్పన, కూడా కూడా 1వ వార్డు కౌన్సిలర్ వేములకొండ పద్మ, ఊట్కూర్ దివ్య, రేణుక, సువర్ణ, రోజా, ప్రేమలత, గంగయ్య, వెంకన్న, సైదులు, నాగరాజు, బిపి గూడెం 3వ వార్డు కౌన్సిలర్ ధరావత్ రవి కుమార్, 
ఆర్ పి లు ఉమారాణి, నిర్మల, సరిత, బిబి, అధ్యక్షురాలు ధరావతు శాంతి, దాసాయిగూడెం కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి, సైదమ్మ, నిర్మల, జయమ్మ, రాములమ్మ, నాగమణి, మంగమ్మ, సైదులు, మల్లయ్య, మిన్నయ్య, కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333