తెలంగాణ సీఎం రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల సమన్లు 

Apr 29, 2024 - 18:39
 0  1

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో  కేసులో భాగంగా సీఎం రేవంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. మే 1వ తేదీన హాజరుకావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది. ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 153/153A/465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

డీప్ వీడియో షేర్ చేసినందుకుగాను పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇందులో సీఎం రేవంత్ ఒకరు. అలాగే ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేపట్టింది. డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసింది. మరి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333