కేతావత్ శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలి గ్రామ యూత్ అధ్యక్షులు సింగం కార్తీక్

మాడుగులపల్లి 07 జనవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- గిరిజన బిడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రీతీ పాత్రుడు పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పార్టీ పటిష్టత కోసం పార్టీనే నమ్ముకొని సుదీర్ఘ కాలంగా ముందుండి పార్టీ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయా రాగ్యా నాయక్ తరువాత పార్టీ కోసం అంతగా పనిచేసిన నాయకుడు మన నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అయన పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి ఈ సారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఇప్పటికే జిల్లాకు రెండు పర్యాయాలు డిసిసి అధ్యక్షుడిగా పనిచేసారని, నల్లగొండ జిల్లాలోనీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి జిల్లాలోనీ అన్ని ఎమ్మెల్యే స్థానాలు భారీ మెజార్టీతో గెలిపించడానికి కష్టపడి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ధైర్యాన్నిస్తూ కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకువెళ్లిన శంకర్ నాయక్ ను ఈసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అందుకు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అందుకు సహకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పి చట్టసభలకు పంపించి బడుగు బలహీన వర్గాల గొంతుకై ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేవేసేలా ముందుండి నడిపిస్తాడని మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సింగం కార్తిక్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరినట్లు తెలిపారు.