రేవంత్ 100 రోజుల పాలనలో ఏముంది..?
ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు..
వందరోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాయని.. ఈ వంద రోజుల పాలనలో ఏముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయని.. తాము అధికారంలో ఉన్న సమయంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా? అంటూ ప్రశ్నించారు. జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫోర్లు స్వేచ్ఛగా తిరిగేవారని.. ప్రస్తుతం సచివాలయంలో విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదని హరీశ్‌రావు నిలదీశారు. నిధుల దుర్వినియోగమని చెప్పినవారు ఆరుగురిని పీఆర్వోలుగా ఎందుకు పెట్టుకున్నారన్నారు.
సీఎం తమ వందరోజు పాలన చూసి ఓటేయాలంటున్నారని.. ఈ పాలనలో ఏముందని ప్రశ్నించారు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ మోదీకి లవ్ లెటర్ రాశారని విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రజలనే కాదు.. కాంగ్రెస్‌ను కూడా మోసం చేస్తున్నారన్నారు. మళ్లీ ప్రధాని అవుతారన్నట్లు రేవంత్ మాట్లాడారని.. కాంగ్రెస్ గెలవదని రేవంత్ చెప్పకనే చెప్పారన్న హరీశ్‌రావు.. గుజరాత్ మోడల్ నిరంకుశమని రాహుల్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, రేవంత్ మాత్రం గుజరాత్ మోడల్ కావాలంటున్నారని.. గుజరాత్ మోడల్ ఫెయిల్ అంటూనే అదే మోడల్ కావాలంటున్నారని ఆరోపించారు.
పది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని..
అలాంటప్పుడు మోదీని ఎందుకు అంత పొగడడమని ప్రశ్నించారు. మూడు నెలల పాలనలో రేవంత్‌రెడ్డి అటు ప్రజలను.. ఇటు కాంగ్రెస్ పార్టీని సైతం మోసం చేస్తున్నారన్నారు. వంద రోజుల పాలనలో ఏం చేశారని ఓటువేయాలన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. కనీసం బడ్జెట్‌లోనూ రైతు రుణమాఫీ నిధుల కేటాయింపులు లేవన్నారు. రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ఇంత వరకు ఇవ్వలేదన్నారు. వచ్చే యాసంగికైనా రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కరువొచ్చిందన్నారు. ట్యాంకర్ల ద్వారా వరిపంటకు నీళ్లుపోయాల్సిన దుస్థితి ఎదురైందన్నారు. తాము అధికారంలోకి వస్తే రూ.4వేల పింఛన్లు ఇస్తామన్నారని.. కనీసం రూ.2వేల పింఛన్‌ను నెలనెలా ఇవ్వడం లేదని.. ఒక నెల ఎగొట్టారని విమర్శించారు. ఆరు గ్యారంటీల్లో 13హామీలు ఉన్నాయని.. అవన్నీ అమలయ్యేది ఎప్పుడు? అని ప్రశ్నించారు. మహిళలను మహాలక్ష్మీలను చేస్తామన్నారని.. మరి ఏమైందని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి.. ఇప్పుడు రక్తంపిండి వసూలు చేస్తున్నారన్నారు.
నిరుద్యోగులకు రూ.4వేలు ఇస్తామని ఊసెత్తడం లేదని.. ఆటో అన్నలకు రూ.12వేలు ఇస్తామని చెప్పారని.. ఎందరో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రూ.16వేలకోట్లు అప్పులు చేశారని.. ఇంకా అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఫ్లోర్లలో ఉండే కుటుంబానికి అన్ని మీటర్లకు ఉచిత విద్యుత్ అమలులో లేదని.. మరి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అవుతాడన్నప్పు.. మోదీ సహకారం ఎందుకు కావాలని అడుగుతారన్నారు. బీజేపీ పార్టీ తమ ఎంపీలను లాగేసుకుంటుందని మండిపడ్డా