అధికారంలోకి రాగానే ‘వాలంటీర్ ’ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారం కోసం జగన్ ని ఎలాగైనా ఓడించాలని కూటమి.. పేదల ప్రజల అభ్యున్నతికి పట్టం కట్టాలంటే మరోసారి ఛాన్స్ ఇవ్వమని అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం బస్సు’ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ యాత్రలో సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారు..
ఎక్కడ చూసినా జన సంద్రం కనిపిస్తుంది.
తాజాగా నాయుడిపేటలో ప్రజా ప్రభంజనం ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.
ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు..
పేద ప్రజల అభ్యున్నతి, భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు. మీ ఓటు మీ భవిష్యత్ తరలాలపై ఆధారపడి ఉంటుంది.. ఏపీ అభివృద్ది చేసే వారికా? ఏపీని దోచుకునే వారికా? నిర్ణయం మీదే అని అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి గ్రామంలో ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చూస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కుట్ర బయట పెట్టుకున్నారు. వలంటీర్ల వ్యవస్థపై లేనిపోని ఆరోపణలు చేసి తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీ అడ్డుకున్నారనినిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రతి నెల 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4 వరకు ఓపిక పట్టండి.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది. తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపై చేసి ప్రతి ఇంటికి మళ్లీ సేవలందించే కార్యక్రమాన్ని చేపడుతాం అని సీఎం జగన్ ప్రకటించారు.